టాటా కొత్త ఐడియా: నానో కారులో మైక్రో-హైబ్రిడ్ వేరియంట్!!

Tata Nano
టాటా మోటార్స్‌కు మరో కొత్త ఐడియా వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత చౌక ధరకు ప్రజల కారు "టాటా నానో"ను అందిస్తున్న కంపెనీ ఇప్పుడు నానో మరింత అప్‌గ్రేడ్ చేసి మరో వేరింయట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాటా నానోలో మైక్రో-హైబ్రిడ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ భావిస్తన్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. టాటా నానో మైక్రో-హైబ్రిడ్ కారు కల నిజమైతే ఆటోమొబైల్ చరిత్రలో టాటా మోటార్స్ మరో కొత్త బెంచ్‌మార్క్ సృష్టించినట్లే.

హైబ్రిడ్ కార్లంటేనే మైలేజ్‌కు పెట్టింది పేరు, అలాంటిది మైక్రో-హైబ్రిడ్ కారు, పైగా టాటా మోటార్స్, ఇంకా టాటా నానో.. ఇవన్నీ పరిశీలిస్తే.. దేశంలోనే అత్యంత మైలేజ్‌ ఇచ్చే కారుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఇలాంటి మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని ప్రముఖ దేశీయ యుటలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) "మహీంద్రా స్కార్పియో"లో ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వల్ల ఇంజన్ ఎక్కువ సమయం న్యూట్రల్‌లో ఉన్నా, లేదా భారీ ట్రాఫిక్ జామ్‌లలో ఇంజన్ ఐడిల్‌గా ఉన్నా వెంటనే గుర్తించి ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఫలితంగా ఇంధన ఆదా అవుతుంది.

మళ్లీ వెంటనే క్లచ్ నొక్కగానే ఆటోమేటిక్‌గా ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే.. టాటా నానో అందిస్తున్న హై ఎండ్ వేరియంట్ కన్నా కాస్తంత ఎక్కువగానే ఉండోచ్చు. టాటా నానో హై ఎండ్ వేరియంట్ కారు ధర రూ. 1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాటా నానో మైక్రో-హైబ్రిడ్ వేరియంట్‌లో ఉపయోగించనున్న మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని బోష్, కాంటినెంటల్ వంటి జెర్మన్ టైర్ 1 సప్లయర్స్ అందించనున్నట్లు సమాచారం. ఈ రెండు కంపెనీలు ప్రస్తుతం టాటా నానో పెట్రోల్ వేరియంట్‌కు టెక్నాలజీని అందిస్తున్నాయి. మరోవైపు నానో కారులో డీజిల్ వేరియంట్‌పై టాటా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంధన ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఫ్యూయెల్ ఎఫీషియంట్ కార్లు వస్తే మంచిదే కదా..! టాటా ప్రయోగం విజయవంతం కావాలని మనమూ కోరుకుందాం.

More from DriveSpark

Article Published On: Sunday, May 22, 2011, 11:14 [IST]
English summary
Leading Indian carmaker Tata Motors is speculated to bring in a micro-hybrid variant of its flagship model of Tata Nano according to the reports. However, there is no official announcement from the auto-major.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+