సెప్టెంబర్ 27న రానున్న సరికొత్త టాటా సఫారీ మెర్లిన్

కొత్త టాటా సఫారీలో 2.2 లీటర్ డైకార్ (DICOR) ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది 140 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. కొత్త టాటా సఫారీ మెర్లిన్‌లో, టాటా బ్రిటీష్ బ్రాండ్ అయిన ల్యాండ్ రోవర్‌కు చెందిన కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. వాస్తవానికి ఇది వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పో విడుదల కావాల్సి ఉంది.
అయితే, ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రూపొందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ 500"కు చెక్ పెట్టేందుకు అనుకున్న దానికంటే ముందుగానే టాటా మోటార్స్ ఈ కారును విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హోండా సిఆర్-వీ, టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలకు ధీటుగా టాటా సఫారీ మెర్లిన్ నిలువనుంది.


Click it and Unblock the Notifications








