టాటా నానోపై కోటి ఆశలు పెట్టుకున్న రతన్ టాటా

"ఇప్పటికే టాటా నానో కారును శ్రీలంక మరియు నేపాల్ మార్కెట్లలో విక్రయిస్తున్నాం. అంతేకాకుండా.. ఇండోనేసియా, తూర్పు యూరప్‌లలోని కొన్ని ప్రాంతాలలో అసెంబ్లింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించామ"ని టాటా మోటర్స్ సర్వసభ్య సమావేశం (ఏజిఎమ్)లో రతన్ టాటా చెప్పారు. అయితే, ఏయే యూరప్‌లో ఏ దేశాల్లో అసెంబ్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయలేదు.
లాటిన్ అమెరికా, బ్రెజిల్, ఆగ్నేయ ఆసియా ముఖ్యంగా ఇండోనేసియాలో తమ వాహనాలను అసెంబ్లింగ్ చేసేందుకు టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తుంది. అలాగే, త్వరలోనే బ్రిటన్, నార్వే దేశాల్లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసిందని రతన్ టాటా చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులు రానున్న కాలంలో కార్ల డిమాండుపై ప్రభావం చూపవచ్చునని మరియు ఇటాలియన్ భాగస్వామి ఫియట్‌తో ఉన్న జాయింట్ వెంచర్ (జేవీ) ఇప్పటికీ నష్టాలను కనబరుస్తోందని టాటా అన్నారు.


Click it and Unblock the Notifications








