నేపాల్ మార్కెట్లో నానో డెలివరీలు ప్రారంభం..!

Tata Nano
ఇటీవలే పొరుగు దేశమైన నేపాల్‌లోకి ప్రవేశించిన భారతదేశపు చిన్న కారు టాటా నానో డెలివరీలు ప్రారంభమయ్యాయి. గడచిన జూన్ 26న నేపాల్ మార్కెట్లోకి ప్రవేశించిన టాటా నానో కారుకు అక్కడి మార్కెట్ నుండి విశేష స్పందన లభించింది. నానో విడుదలైన పది రోజుల్లోనే 352 యూనిట్లు బుకింగ్ అయ్యాయి. కాగా.. టాటా నానో కార్ల అధీకృత డీలర్ అయిన సిప్రాడి ట్రేడింగ్ గత శనివారం నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌక కారు డెలివరీలను ప్రారంభించినట్లు ఓ నేపాల్ పత్రిక ప్రచురించింది.

శనివారం రోజున దాదాపు 250 నానో కార్లు డెలివరీ అయినట్లు సమాచారం. పూర్తిగా నగదు చెల్లించి టాటా నానో కారును కొనుగోలు చేసే వారికి తక్షణమే కారు డెలివరీ అవుతుంది. ఫైనాన్స్‌లో నానో కారును కొనుగోలు చేసే వారికి మాత్రం బ్యాంక్ వెరిఫికేషన్‌లు పూర్తయిన తర్వాతనే కారును డెలివరీ చేస్తారు. నేపాల్‌లో అధిక కస్టమ్ డ్యూటీల కారణంగా మనదేశంలో దాదాపు లక్షన్నర రూపాయలున్న టాటా నానో అక్కడి మార్కెట్‌కు వెళ్లే సరకి దాదాపు 7.98 లక్షల ఎన్‌పిఆర్‌లు (నేపాల్ రూపీ)లుగా అవుతోంది.

More from DriveSpark

Article Published On: Monday, August 1, 2011, 12:50 [IST]
English summary
According to Nepal Republic Media, Sipradi Trading, the official distributor for Indian cheapest car Tata Nano has began deliveries of the small car on Saturday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+