కొత్త సుమో గోల్డ్‌ను విడుదల చేసిన టాటా మోటార్స్

టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీలో 3-లీటర్ టర్బోచార్జ్‌డ్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 80 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. పాత టాటా సుమోలో ఉపయోగించిన ఇంజన్ కన్నా ఇది మరింత శక్తివంతమైన ఇంజన్. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఈ కొత్త టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీ ప్రతి లీటరుకు 14.07 కి.మీ. మైలేజీనిస్తుంది.
సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అమర్చిన మెరుగైన సస్పెన్షన్, సరికొత్త ఫ్రంట్ లుక్, కొత్త హెడ్‌ల్యాంప్స్, బంపర్, గ్రిల్‌పై క్రోమ్ కోటింగ్ కలిగిన టాటా లోగో, సరికొత్త గ్రిల్ డిజైన్, ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కప్ హోల్డర్స్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, వెనుకవైపు అమర్చిన వైపర్, మడుచుకునేందుకు వీలుగా అమర్చిన వెనుక సీట్లు వంటి ఎన్నో మార్పులు ఈ కొత్త సుమో గోల్డ్‌లో చేయబడ్డాయి.
ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ఈ సరికొత్త టాటా సుమో గోల్డ్ ఎమ్‌యూవీ 36 నెలలు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. ఇది జిఎక్స్, ఈఎక్స్, ఎల్ఎక్స్, సిఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. ఎంట్రీ లెవల్ టాటా సుమో గోల్డ్ ధర రూ.5.04 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








