నానో ఫ్లాట్‌ఫామ్‌పై టాటా కొత్త కాన్సెప్ట్ కారు 'పిక్సెల్'

మూడు డోర్లు, నాలుగు సీట్లతో రూపొందించిన పిక్సెల్‌లో ప్రయాణికులు సులువుగా కారు ఎక్కడానికి, దిగడానికి వీలుగా రెండు డోర్లు కత్తెరలా పైవైపుకు (సిజర్ డోర్స్) ఓపెన్ అయ్యే విధంగానూ, మూడవ డోర్ కారు వెనుక భాగాన ఉండేలా డిజైన్ చేశారు. ఇకపోతే జీరో టర్న్, ఇన్ఫైనేట్లీ వేరియబుల్ ట్రాన్సిమిషన్ (ఐవిటి) అనే అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాలను ఇందులో ఉపయోగించారు. ఇందులో మరో కీలకమైన ఫీచర్ ఏంటంటే.. 'మై టాటా కనెక్ట్' అనే స్మార్ట్ ఫోన్. ఇది టాటా మోటార్స్ అందిస్తున్న తొలి హ్యూమన్-మెషీన్ ఇంటర్‌ఫేస్ కాన్సెప్ట్ (హెచ్ఎమ్ఐ).
టాటా పిక్సెల్ 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. టాటా నానో ద్వారా నేర్చుకున్న అనుభవంతో ఇందులో ఉపయోగించే ఇంజన్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఓవర్‌హీట్ కాకుండా ఉండే విధంగా కంపెనీ చర్యలు తీసుకుంది. అందుకు అవసరమయ్యే ఆధునిక కూలెంట్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేసింది. ఇంకా ఇంధన సామర్థ్యాన్నిచ్చే టైర్స్, స్టాప్-స్టార్ట్ టెక్నాలజీ, ఇంటలిజెంట్ బ్యాటరీ చార్జింగ్ వంటి సదుపాయాలు పిక్సెల్ సొంతం. ఇక కర్బన వ్యర్థాల విషయానికి వస్తే.. ఇది కిలోమీటరుకు 89 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications








