టాటా విస్టా వర్సెస్ మారుతి స్విఫ్ట్: ఏది బెస్ట్..?

మారుతి సుజుకి తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, అలాగే టాటా మోటార్స్ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త విస్టా కార్లు నున్నా నేనా అని పోటీపడుతున్నాయి. మరి వీటిలో ఏది బెస్ట్ తెలుసుకోవాలంటే.. ఓ లుక్కేయండి..!!
విస్టా విఎక్స్ (ఏబిస్) మోడల్‌కు స్విఫ్ట్ విడిఐ మోడల్‌కు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలేంటో ఒకసారి పరిశీలిద్దాం..!
పెర్ఫామెన్స్:
పెర్ఫామెన్స్ విషయంలో రెండు మోడళ్లు కూడా సమానంగానే ఉంటాయి. ఇవి రెండూ కూడా 1248 సీసీ, 4-సిలిండర్, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్ సిస్టమ్‌తో 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తాయి. మైలేజ్ విషయంలో కూడా టాటా విస్టా, మారుతి స్విఫ్ట్‌లు రెండూ ఇంచు మించు సమానంగానే ఉంటాయి. టాటా విస్టా లీటరుకు 22.3 కి.మీ. మైలేజీనిస్తే, మారుతి స్విఫ్ట్ లీటరుకు 22.9 కి.మీ. మైలేజీనిస్తుంది.
స్థలం (స్పేస్):
కారు లోపల స్థలం విషయంలో ఈ రెండింటికీ కాస్తంత వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో టాటా విస్టానే ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. టాటా విస్టా.. 3795 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును మరియు 1550 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. అదే మారుతి స్విఫ్ట్ విషయానికి వస్తే ఇది 3850 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పును మరియు 1530 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. టాటా విస్టాలో వెనుక సీట్లు విశాలంగా ఉండి అధిక లెగ్‌రూమ్‌ను కలిగి ఉంటాయి. మారుతి స్విఫ్ట్‌లో కాస్తంత ఇరుకుగా ఉంటుంది. విస్టా బూట్‌స్పేస్ 232 లీటర్లు. స్విఫ్ట్ బూట్‌స్పేస్ 204 లీటర్లు.
ఇంటీరియర్స్:
టాటా విస్టాలో బ్లాక్ అండ్ సహారా బీగీ వర్ణంలో ఉండే విశాలమైన ఇంటీరియర్స్, మృదువైన ఫినిషింగ్‌తో రెండు రంగుల కలయితో ఉండే డ్యాష్‌బోర్డ్, 60:40 నిష్పత్తిలో మడుచుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వెనుక సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కానీ, మారుతి స్విఫ్ట్‌లో ఇవేవీ లేవు.
ఫీచర్లు:
కొత్త టాటా విస్టాలో, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఆక్స్-ఇన్, యూఎస్‌బి పోర్ట్ కనెక్టివిటీతో కూడిన ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఐదు మొబైల్ ఫోన్ల వరకూ కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా ఉండే బ్లూ 5, స్టీరింగ్‌పై ఉండే ఆడియో కంట్రోల్స్, ఇంటలిజెంట్ రియర్ వైపర్, అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఏసి కంట్రోల్ ఉన్నాయి. కానీ స్విఫ్ట్ విడిఐలో ఈ ఫీచర్లేవీ లభించవు.
ధర:
ఇక ధర విషయానికి వస్తే.. టాటా విస్టా ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధర రూ.5,51,090గా ఉండగా మారుతి సుజుకి స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధర రూ.5,72,502గా ఉంది.
ఏది బెస్ట్:
మొత్తంమీద చూస్తే.. కొత్త విస్టా ధర విషయంలోనూ, ఫీచర్ల విషయంలోనూ అన్ని విధాలుగా బెస్ట్ అని చెప్పవచ్చు. విస్టా చూడటానికి హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయినప్పటికీ.. ఇందులో సెడాన్ క్లాస్ అనుభూతిని పొందవచ్చు. కొత్త విస్టాను ఇప్పుడు బుక్ చేసుకుంటే పండుగ నాటికి డెలివరీని పొందవచ్చు. కానీ స్విఫ్ట్ విషయంలో అలా కాదు. మానేసర్ ప్లాంటులో తాజాగా సమ్మె జరుగుతుండటంతో దీని వెయిటింగ్ పీరియడ్ మరికాస్త ముందుగు పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








