టాటా వెస్ట్‌సైడ్ రీటైల్ స్టోర్‌లలో నానో సేల్స్..!?

టాటాకు చెందిన రీటైల్ స్టోర్‌లలో నానో కారును విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. సాధారణందా ఏదైనా కంపెనీ కారును కొనుగోలు చేయాలంటే సదరు డీలర్లు, షోరూమ్‌ల వద్దకు వెళ్లి అడ్వాన్సు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. తర్వాత డెలివరీ కోసం కొన్ని రోజులు లేదా నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. దేశీయ కంపెనీలైతే ఈ వెయింటింగ్ పీరియడ్ కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ విదేశీ కంపెనీలు, లగ్జరీ కార్ల విషయంలో ఈ సమయం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది.
అయితే.. ప్రస్తుతం చిన్న కార్ల మార్కెట్లో నెలకొన్న పోటీ కారణంగా వివిధ కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దశలో భాగంగానే టాటా మోటార్స్ కూడా నానోను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. గతంలో కూడా నానో విక్రయాల కోసం టాటా ఓపెన్ సేల్స్‌ను ప్రకటింటించిన సంగతి తెలిసిందే. ఈ కారు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు కాబట్టి చిన్న చిన్న షాపింగ్ మాల్స్‌లో కూడా దీనిని ప్రదర్శనకు ఉంచి అక్కడి నుండే వినియోగదారులు నానో కారును బుకింగ్‌లను చేసకునే అవకాశాలను టాటా మోటార్స్ కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications








