జర్మనీలో మ్యూట్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ఆవిష్కరణ

అవసరమైతే, ఓ జింక్-ఎయిర్ బ్యాటరీను కారులో రిజర్వులో ఉంచుకొని ప్రయాణించే రేంజ్‌ను పెంచుకోవచ్చు. కారు బరువును తగ్గించేందుకు దీన్ని అల్యూమినియం, కార్బన్ ఫైబర్‌లతో డిజైన్ చేశారు. దీని బరువు సుమారు 500 కేజీలు. జర్మనీలోని టెక్నిస్చే యూనివర్సిటేట్ ముయెంచెన్ (టియూఎమ్)కు చెందిన వాహన ఇంజనీర్ మార్కస్ లీన్‌క్యాంప్ దీనిని రూపొందించారు.
ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ బరువును కలిగి ఉండటం ఎంతో అవసరమని, ఎక్కువ బరువు కలిగి ఉన్న ఎలక్ట్రిక వాహనాలకు అధిక బ్యాటరీ పవర్ కావాల్సి వస్తుందని, ఫలితంగా వాహన తయారీకయ్యే ఖర్చుకూడా గణనీయంగా పెరుగుతుందని మార్కస్ అభిప్రయాపడ్డారు. మ్యూట్ కాన్సెప్ట్ కారును టియూఎమ్‌లోని 20 డిపార్ట్‌మెంట్‌లకు చెందిన 200 మంది స్టాఫ్ మెంబర్లు అభివృద్ధి చేశారని ఆయన చెప్పారు.
సమర్థత, తక్కువ వ్యయం మరియు భద్రత అనే మూడు అంశాలను ప్రధానంగా చేసుకొని మ్యూట్‌ని అభివృద్ధి చేసినట్లు మార్సక్ తెలిపారు. ప్రస్తుతం జర్మనీలో జరుగుతున్న 64వ ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో టియూఎమ్ తమ కాన్సెప్ట్ మ్యూట్‌ను ఆవిష్కరించింది.


Click it and Unblock the Notifications








