ఇండో-ఈయూ ఒప్పందం: సగం ధరకే విదేశీ కార్లు..!

ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్)పై భారత్ ఈ ఏడాది చివరి నాటికి సంతకాలు చేసే అవకాశాలున్నాయి. ఈ ఒప్పందంలో కార్లు కూడా ఉన్నందు వల్ల వీటిపై దిగుమతి సుంకాలు పూర్తిగా తొలగించే ఆస్కారం ఉంది. ఫలితంగా విదేశీ లగ్జరీ కార్లు ప్రస్తుత ధరకన్నా చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు రూ. 80 లక్షలు ఉండే బిఎమ్‌డబ్ల్యూ కారుపై సుమారు రూ. 30 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. అలాగే.. స్వీడన్ నుంచి దిగుమతి చేసుకునే వొల్వో ఎక్స్‌సి 60 కారు ధర రూ. 40.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ తగ్గవచ్చు.


Click it and Unblock the Notifications








