ధరల పెంపుకు సిద్ధమవుతున్న ఆటోమొబైల్ కంపెనీలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇప్పటికే ధరలను పెంచిన సంగతి తెలిసిందే. మారుతి తాజాగా విడుదల చేసిన అత్యధికంగా అమ్ముడయ్యే కారు (ది మోస్ట్ సెల్లింగ్ కార్) ఆల్టో కె10 మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ధరలను 2.2 శాతం (రూ. 8,000 వరకూ) పెంచింది. మారుతి సుజుకి బాటలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ తమ వాహనాల ధరలను పెంచాలని భావిస్తుంది. ప్రీమియం కార్లయిన వెర్నా, శాంత్రో, ఐ10, ఐ20 వంటి కార్ల ధరలను 1.5 శాతం మేర పెంచాలని హ్యుందాయ్ భావిస్తోంది.
ఇదేవిధంగా జనరల్ మోటార్ కంపెనీ కూడా కొన్ని రకాల మోడళ్లపై ధరలను 1-1.5 శాతం (రూ. 2,500 నుంచి రూ. 25,000) మేర పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ ప్రకటించారు. అలాగే టాటా మోటార్స్ సంస్థ అన్నిరకాల ప్యాసింజర్ వాహనాలపై ధరలను రూ. 1,500 నుంచి 15,000 మేర, వాణిజ్య వాహనాల (కమర్షియల్ వెహికల్స్)పై రూ. 3,000 నుంచి రూ. 30,000 మేర ధరలను పెంచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








