వావ్.. మాంచి కిక్కిచ్చే కార్..: వైన్‌తో నడిచే కారు

ఇలాంటి ఓ పరిశోధకుడి బుర్రలో నుండి ఆవిర్భవించినదే ఈ తాగుబోతు కారు (సారీ వైన్ కార్). ఈ కారు పూర్తి పేరు 'లోటస్ ఎక్సిజ్ 270ఈ ట్రై-ఫ్యూయెల్'. ఇది సాధారణ పెట్రోల్‌తోనే కాకుండా.. వైన్, చాక్లెట్ మరియు చీజ్ వంటి పదార్థాలతో కూడా పరుగులు తీస్తుంది. ఈ మూడు పదార్థాలతో నడిచేందుకు వీలుగా లోటస్ ఎక్సిజి కారు ఇంజన్‌ను మోడిఫై చేశారు. తాగడానికి ఉపయోగించని వైన్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌తో ఇది నడుస్తుంది.
అంతేకాకుండా.. చీజ్ మరియు చాక్లెట్ల్ ఉత్పత్తి తయారయ్యే ఓ ద్రవపధార్థం సాయంతో ఈ కారు నడుస్తుంది. ఇది ప్రారంభ దశ కాబట్టి, వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే ఇంధనాలు ప్రస్తుత ఇంధన ధర కాస్తంత ఎక్కువేనట. బ్రిటన్‌లో నిర్వహించిన ప్రైస్ ఆఫ్ వేల్స్ అనే ఓ పర్యావరణ కార్యక్రమంలో ఈ లోటస్ ఎక్సిజి కారును ప్రదర్శించారు. నిన్నటి ఓ కథనంలో తాగి కారు నడిపి పోలీసులకు చిక్కిన వారి గురించి తెలుసుకున్నాం, కానీ కారే మందు కొట్టేస్తే... పోలీసులు ఎవరిని అరెస్టు చేయాలి..!?


Click it and Unblock the Notifications








