పల్లెకు పోదాం.. ఛలో.. అంటున్న ఆటోమొబైల్ కంపెనీలు

Car Market
ఒకప్పుట్లో ధనవంతులు మాత్రమే వినియోగించే నాలుగు చక్రాల రథం "కారు". ధనికుల విలాసలాకు, హోదాలకు ప్రతీకగా కారును గుర్తించేవారు. కానీ.. ఆ తర్వాతి కాలంలో మానవ సాంకేతిక నైపుణ్యంతో వచ్చిన పెను మార్పులు ఆటోమొబైల్ రంగ రూపు రేఖలను మార్చివేశాయి. ఇప్పుడు ఏ వీధిలో చూసినా కనీసం ఓ కారు దర్శనమిస్తుంది. లక్ష రూపాయలు మొదలుకొని కార్లు లభిస్తుండటంతో ఈ మధ్య కాలంలో కార్లు కొనేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మధ్యతరగతి ప్రజలు సైతం కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా.. వాహనాలను వినియోగించే వారి సంఖ్య కూడా పెరిగి, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది.

ఈ పరిస్థితులు ఆటోమొబైల్ కంపెనీలపై తీవ్ర ప్రభావాలను చూపుతున్నాయి. పార్కింగ్ స్థలాలు లేకపోవడం, నగరాలు, పట్టణాల్లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలతో కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారు ఆలోచనలో పడుతున్నారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలు సన్నగిల్లుతున్నాయి. అయితే ఈ పరిమాలతో ఆటోమొబైల్ కంపెనీలు డీలాపడిపోకుండా కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. "రూరల్ ఛలో" (పల్లెకు పోదాం) అంటూ.. రూరల్ ప్రాంతాల్లో ఉండే వినియోగదారులను ఆకట్టుకునే పనిలోపడ్డాయి. ఫలితంగా కంపెనీ విక్రయాలు పెరగడంతో పాటు తమ ఉత్పత్తులకు ఉచిత ప్రచారం లభించినట్లవుతుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ మోటార్స్ వంటి అగ్ర కంపెనీలు ఇదే దారిపట్టాయి. పల్లె ప్రాంతాలకు మహీంద్రా ఇప్పటికే సుపరిచితం, ట్రాక్టర్ల వంటి పలు వ్యవసాయ పరికరాలతో మహీంద్రా రైతులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రూరల్ మార్కెట్లలో పెద్దగా పోటీ లేకపోవడం, పైపెచ్చు ట్రాఫిక్ సమస్య ఉండకపోవడం వంటి పలు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ఈ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ విభాగంలో మారుతి 20 శాతం (తయారైన ప్రతి ఐదు కార్లలో ఒకటి పల్లె విక్రయించబడుతుంది) మార్కెట్‌ను కలిగి ఉంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో డీలర్ నెట్‌వర్క్, సర్వీస్ సెంటర్ల ఏర్పాటు వంటి పలు ప్రణాళికలకు మారుతి వ్యూహ రచన చేస్తోంది. ఇదే బాటలో హ్యుందాయ్, జనరల్ మోటార్ వంటి పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు పల్లె బాట పట్టాయి.

More from DriveSpark

Article Published On: Friday, January 28, 2011, 8:03 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+