బెంగుళూరు ప్లాంటుపై సునామీ ఎఫెక్ట్..: ప్రారంభోత్సవం వాయిదా

గతేడాది డిసెంబర్ నెలలో విడుదల చేసిన సెడాన్ మోడల్ కారు "ఇతియోస్"ను భారత్‌లో తయారు చేసేందుకు టొయోటా ఈ ప్లాంటును ఏర్పాటు చేసింది. కాగా.. టొయోటా చిన్నకారు లివా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. లివా 1.2 లీటర్ల పెట్రోలు ఇంజన్ సామర్థ్యంతో లభిస్తుంది.
జపాన్‌లో నెలకొన్న విషాద పరిస్థితుల కారణంగా.. మార్చి 15, 2011న ఘనంగా జరగాల్సిన తమ రెండవ భారత ప్లాంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎమ్) మేనేజింగ్ డైరక్టర్ హిరోషి నకగవా తెలిపారు. జపాన్‌లోని తమ కేంద్రాలలో పనిచేస్తున్న టీకేఎమ్ ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కంపెనీ ఓ ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
జపాన్ భూకంపం, సునామీల కారణంగా తమ ప్లాంట్లకు ఇంతవరకూ ఎలాటి ముప్పు సంభవించలేదని, అయినప్పటికీ తమ అనుబంధ సంస్థలు, డీలరు భాగస్వాములు, సప్లయ్ భాగస్వాములకు ఎంతమేర నష్టం వాటిల్లిందనే విషయాన్ని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు కంపెనీ తరఫున ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








