ఇంజన్ ప్లాంటు విస్తరణ కోసం 72 మి. డాలర్ల పెట్టుబడి: ఫోర్డ్

ఈ పెట్టుబడులను చెన్నయ్ ప్లాంటు అభివృద్ధి, మరియు భారత్‌లో మరిన్ని విస్తరణలకు ఉపయోగిస్తామని, అలాగే 2015 నాటికి దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న ఎనిమిది ఫోర్డ్ గ్లోబల్ మోడళ్ల మద్ధతుకు ఈ నిధులను కంపెనీ ఉపయోగించనుందని ఆయన వివరించారు. ఈ విస్తరణ ప్రక్రియ పూర్తయితే ఇంజన్ ప్లాంటులో మూడో షిఫ్టును కూడా ప్రారంభిస్తామని, దీని ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని బోన్‌హామ్ తెలిపారు. ఈ ఇంజన్ ప్లాంటును మేజర్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఫోర్డ్ తీర్చిదిద్దనుంది.


Click it and Unblock the Notifications








