ఇంజన్ ప్లాంటు విస్తరణ కోసం 72 మి. డాలర్ల పెట్టుబడి: ఫోర్డ్

Ford
అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ భారత్‌లోని ఫోర్డ్ ఇండియా ఇంజన్ ప్లాంటులో వార్షిక ఉత్పత్తి పెంపు కోసం 72 మిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్లాంటులో ఏటా 2,50,000 యూనిట్ల నుంచి 3,30,000 యూనిట్ల ఇంజన్లను ఫోర్డ్ ఉత్పత్తి చేస్తోంది. 2012 సంవత్సరం మధ్య భాగంలోనే ఈ విస్తరణ కార్యక్రమం పూర్తవుతుందని, ఫోర్డ్ ఇండియాలో ఇప్పటికే దాని మాతృ సంస్థ అయిన ఫోర్డ్ మొత్తం 100 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులను కేటాయించిందని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ తెలిపారు.

ఈ పెట్టుబడులను చెన్నయ్ ప్లాంటు అభివృద్ధి, మరియు భారత్‌లో మరిన్ని విస్తరణలకు ఉపయోగిస్తామని, అలాగే 2015 నాటికి దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న ఎనిమిది ఫోర్డ్ గ్లోబల్ మోడళ్ల మద్ధతుకు ఈ నిధులను కంపెనీ ఉపయోగించనుందని ఆయన వివరించారు. ఈ విస్తరణ ప్రక్రియ పూర్తయితే ఇంజన్ ప్లాంటులో మూడో షిఫ్టును కూడా ప్రారంభిస్తామని, దీని ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని బోన్‌హామ్ తెలిపారు. ఈ ఇంజన్ ప్లాంటును మేజర్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఫోర్డ్ తీర్చిదిద్దనుంది.

Most Read Articles

English summary
Ford Motor Company, the American automobile giant will invest $72 million in its engine plant to increase the annual production capacity from the current 250,000 units to 330,000 units. Michael Boneham, president and managing director of Ford India said that the expansion programme will be completed in mid-2012 and the total investment of parent Ford Motor Company in India will be more than $1 billion.
Story first published: Friday, May 20, 2011, 11:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X