గుర్గాన్-మనెసర్ పరిధిలోని పరిశ్రమలలో వాయిదా పడిన రెండు గంటల సమ్మె

ఇదిలావుంటే డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న మారుతీ ఉద్యోగులకు మద్దతుగా గుర్గాన్-మనెసర్ పారిశ్రామిక ప్రాంతం పరిధిలోని పరిశ్రమలలో రెండు గంటల పాటు జరగాల్సిన విధుల బహిష్కరణ వాయిదా పడింది. సుమారు 65 పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా..ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అభ్యర్థన మేరకు వాయిదా వేసినట్లు అఖిల భారత కాంగ్రెస్ వాణిజ్య సంఘం (ఎఐటియుసి) తెలిపింది. రెండు గంటల విధుల బహిష్కరణకు ఎఐటియుసితోపాటు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) మద్దతు పలికింది. అయితే కేవలం 24 గంటలు మాత్రమే వాయిదా పడిందని నేటి ఉదయం నుంచి రెండు గంటల విధుల బహిష్కరణలో అన్ని పరిశ్రమల కార్మికులు పాల్గొంటారని ఎఐటియుసి కార్యదర్శి డి.ఎల్ సచ్‌దేవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








