ఇక ఇతియోస్ కారు డెలివరీ ఆలస్యం కాదు..: టొయోటా

ఇథియోస్ వాహనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని త్వరగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. టికెఎమ్ మార్కెటింగ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ మాట్లాడుతూ ఇథియోస్ కార్ల డెలివరీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం ఇతియోస్ వెయిటింగ్ సమయాన్ని సగానికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంతేకాకుండా.. ఇతియోస్ కార్లను తయారు చేస్తున్న ప్లాంట్‌లో రెండవ షిఫ్ట్ పని కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. ఎతియోస్ బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేసేందుకే.. ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించిన ఇతియోస్-లివాను జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు కంపెనీ వివరించింది. ఈ సమయాన్ని ఇతియోస్ డిమాండ్‌ను తీర్చేందుకు ఉయోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా టయోటా కార్లను అందిస్తోందని నకాగవా చెప్పారు.


Click it and Unblock the Notifications








