టొయోటా ఎతియోస్ డీజిల్ వెర్షన్ కార్ల బుకింగ్‌లు ప్రారంభం!?

Toyota Etios Liva
జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తొలి చిన్న కారు ఎతియోస్ లివాలో డీజిల్ వేరియంట్‌కు మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన టొయోటా ఎతియోస్ సెడాన్ వేరియంట్లలో డీజిల్ వెర్షన్ కార్ల బుకింగ్‌లను అనధికారికంగా టొయోటా డీలర్లు ప్రారంభించినట్లు సమాచారం.

వాస్తవానికి టొయోటా ఎతియోస్ డీజిల్ వేరియంట్‌లు (ఎతియోస్ సెడాన్ మరియు లివా హ్యాచ్‌బ్యాక్) వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లు కూడా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కానున్నయనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టొయోటా డీలర్లు ముందస్తుగానే బుకింగ్‌లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై కంపెనీ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.

కాగా.. భారత వినియోగదారుల కోసం టొయోటా అభివృద్ధి చేస్తున్న ఎతియోస్ డీజిల్ కార్లు టొయోటా ఆల్టిస్ మాదిరిగానే 1.4 లీటర్ డీజిల్‌ను ఇంజన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో టొయోటా ఎతియోస్ లివా పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. దేశీయ మార్కెట్లో దీని ధర ధర రూ. 3.99 నుంచి రూ. 5.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ఢిల్లీ)గా ఉంది.

భారత్‌లో టొయోటాకు ఇది తొలి కాంపాక్ట్ కారు. ఎతియోస్ లివా డీజిల్ వేరియంట్ కారు ఇటీవలే మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు రిట్జ్‌, హ్యుందాయ్‌ ఐ10, ఐ20, ఫోర్డ్‌ ఫిగో, చెవర్లే బీట్‌ డీజిల్ మరియు ఫోక్స్‌వ్యాగన్ పోలో వంటి కాంపాక్ట్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ఇంజన్ 75 గరిష్ట శక్తిని విడుదల చేస్తూ లీటరుకు 21 కి.మీ. మైలేజీని ఇవ్వవచ్చునని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2011, 18:21 [IST]
English summary
Japanese carmaker Toyota's Indian subsidiary Toyota Kirloskar Motors (TKM) is planning to launch the diesel versions Etios sedan and Etios Liva hatchback in September 2011. Both Etios and Liva are speculated to hit the Indian roads on 9th of September. Some recent news reports claim that the bookings for both of these diesel version models are open unofficially.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+