జూన్ 27న టొయోటా చిన్న కారు 'ఎథియోస్ లివా' విడుదల

ప్రధానంగా యువతను దృష్టిలో పెట్టుకుని ఆధునిక శైలిలో ఎథియోస్ లివాను తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. ఇది ధరకు తగిన విలువ ఉంటుందని, పోటీదారులను దృష్టిలో ఉంచుకొని కాంపీటిటివ్ ప్రైస్‌తో ఎధియోస్ లివాను అందిస్తున్నామని టికెఎమ్ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ కారును గత ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా, ఈ కారుకు మార్కెట్లో లభిస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకొని మరియు వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతుండంటతో దాన్ని తగ్గించేందుక జూన్ వరకు వాయిదా వేయాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది. మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, ఫోక్స్‌వ్యాగన్ పోలో, నిస్సాన్ మైక్రా, స్కొడా ఫ్యాబియా మరియు ఫియట్ పుంటో వంటి మోడళ్ల ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








