రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించిన టొయోటా ఎతియోస్ లివా

Toyota Etios Liva
టొయోటా అందిస్తున్న మొట్టమొదటి చిన్న కారు ఎతియోస్ లివా లాంఛనంగా రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించింది. టొయోటా మరియు కిర్లోస్కర్ మోటార్స్‌ల జాయింట్ వెంచర్ టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ (టికెమ్) ఇటీవలే భారత మార్కెట్లోకి ఎతియోస్ ఫ్లాట్‌ఫామ్‌పై విడుదల చేసి తొలి కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఎతియోస్ లివా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా భావితరం యువతను దృష్టిలో ఉంచుకొని, వారి అవసరాలకు అనుగుణంగా ఈ కారులోని ఫీచర్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభించే ఎతియోస్ లివా ఐదు వేరియంట్లు, ఏడు రంగులలో అందుబాటులో ఉంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో వీటి ధరల విషయానికి వస్తే రూ. 4,24,364 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) నుంచి మొదలుకొని రూ. 6,12,081 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) వరకూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారుకు అన్ని ప్రాంతాల మార్కెట్ల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని కంపెనీ తెలిపింది. కాగా.. మరోవైపు, పెట్రోల్ ధరలు నానాటికీ పెరుగుతుండటంతో వినియోగదారులు డీజిల్ వేరియంట్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎతియోస్ బ్రాండ్‌లో డీజిల్ వేరియంట్లను కూడా త్వరలనే విడుదల చేస్తామని టికెఎమ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) శైలేష్ శెట్టి తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ మార్కెట్లో ఈ కారుకు బుకింగ్స్ ప్రారంభమయినట్లు కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 5, 2011, 10:54 [IST]
English summary
Toyota Kirloskar Motor launched its first ever compact car Etios Liva in Hyderabad at the price tag of Rs 4.24 lakh to Rs 6.12 lakh (ex-showroom Hyderabad). Liva, available in five variants and seven colors. Liva, built on the Etios' sedan platform.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+