చెన్నై మార్కెట్లోకి ప్రవేశించిన టొయోటా చిన్న కారు లివా

Toyota Etios Liva
టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన తమ తొలి చిన్న కారు తమిళనాడు మార్కెట్లోకి ప్రవేశించింది. లివా విడుదల ద్వారా మొత్తం ప్యాసింజర్ కార్ విభాగంలో 4.5-5 శాతం మార్కెట్ వాటాను ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. లివా విడుదల సందర్భంగా కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (కమర్షియల్) శేకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఎతియోస్ వాహన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే ఎతియోస్ లివాను రూపొందించినట్లు తెలిపారు. ఎతియోస్ బ్రాండ్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వీటి వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు రెండవ ప్లాంటులో ఉత్పత్తిని 70,000 యూనిట్లను 1,20,000 యూనిట్లకు పెంచినట్లు ఆయన తెలిపారు.

అత్యంత పోటీ ఉన్న బి-సెగ్మెంట్‌లో 8 శాతం మార్కెట్ వాటాతో ఎతియోస్ వేగంగా దూసుకుపోతుందని కంపెనీ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్) శైలేష్ శెట్టి తెలిపారు. యువ వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. నాలుగు వేరియంట్లలో లభించే ఎతియోస్ లివా ధరలు రూ. 4.14 నుండి రూ. 5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ చెన్నయ్) మధ్య ఉన్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్‌, రిట్జ్‌, హ్యుందాయ్‌ ఐ10, ఐ20, ఫోర్డ్‌ ఫిగో, చెవర్లే బీట్‌ వంటి కాంపాక్ట్ కార్లకు లివా గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, July 4, 2011, 11:37 [IST]
English summary
Toyota Kirloskar Motor launched its first compact car Etios Liva in Chennai, Company is aiming to achieve 4.5-5 per cent market share in the overall passenger car segment with their small car. Etios Liva, available in four variants, is priced between Rs.4.14 lakh and Rs.5.99 lakh ex-showroom Chennai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+