టొయోటా ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ విడుదలకు రంగం సిద్ధం

దేశీయ మార్కెట్లో ఎతియోస్ లివా రూ. 4 లక్షల నుంచి రూ. 5.5 లక్షల వరకూ ఉండే అవకాశం ఉంది. ఎతియోస్ సెడాన్‌కు మార్కెట్లో ఇప్పటికే మంచిపేరు ఉంది. ఇదే ఫ్లాట్‌ఫామ్‌పై వస్తున్న ఎతియోస్ లివా మోడల్‌కు కూడా మార్కెట్లో మంచి స్పందన లభించే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఎతియోస్ లివా 1.2 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్‌తో 80 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తు, 5స్పీడ్ మ్యాన్యువల్ గేర్ సిస్టమ్‌తో లభిస్తుంది. హ్యుందాయ్ ఐ10, మారుతి వ్యాగన్ఆర్, ఫోర్డ్ ఫిగో, ఫోక్స్‌వ్యాగన్ పోలో, మారుతి రిట్జ్ వంటి హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు ఎతియోస్ లివా గట్టి పోటీ ఇవ్వనుంది. అంటే టొయోటా అమ్ముల పొదిలోకి మరో బలమైన అస్త్రం చేరినట్లే అన్నమాట.


Click it and Unblock the Notifications








