2012లో లక్ష ఎతియోస్ వాహనాలను విక్రయించనున్న టొయోటా

ఉత్పత్తి పెంపుకు గానూ దాదాపు 4.9 బిలియన్ యెన్(60.9 మిలియన్ డాలర్ల)ను వెచ్చించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. టొయోటా ఇటీవలే భారత మార్కెట్లోకి అప్‌గ్రేడెడ్ కరోలా ఆల్టిస్ సెడాన్ కారును విడుదల చేయగా సోమవారం తమ చిన్న కారు 'ఎతియోస్ లివా'ను కూడా విడుదల చేసింది. లివా ధర రూ. 3.99 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి స్విఫ్ట్, రిట్జ్, హ్యుందాయ్ ఐ10, ఐ20, ఫోర్డ్ ఫిగో, చెవర్లే బీట్ వంటి కాంపాక్ట్ కార్లకు లివా పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








