ఆసియన్ మార్కెట్ కోసం చవక కార్ల తయారీపై కన్నేసిన టొయోటా

ఇంకా పలు విదేశీ కంపెనీలు కూడా ఇదే బాటలో చవక కార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. తాజాగా ఈ జాబితాలోకి జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ "టొయోటా" కూడా చేరిపోయింది. ఆసియా మార్కెట్లకు అనుగుణంగా తక్కువ ధరకే లభించేలా ఓ చిన్నకారును రూపొందించాలని టొయోటా సన్నాహాలు చేస్తుంది. టొయోటా కంపెనీ అనుబంధ సంస్థ అయిన 'దైహత్సు' ఈ చిన్నకారు ప్రాజెక్టును పర్యవేక్షించనుంది. దైహత్సు చిన్న వాహనాలను రూపొందించడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంది.
టొయోటా కంపెనీలో దైహత్సుకు 51 శాతం వాటా ఉంది. అంతేకాకుండా.. సాలీన లక్ష చిన్నకార్లను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ 20 బిలియన్ ఎన్‌లను పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఇండోనేషియాలో ఉన్న ప్లాంటులో ఈ కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండోనేషియా ఉత్పత్తి కేంద్రాన్ని టొయోటా రెండవ అతిపెద్ద ఉత్పత్తి ప్లాంట్‌గా అభివృద్ధి చేయాలని టొయోటా లక్ష్యంగా పెట్టుకుంది. 2013 నాటికి తమ చిన్నకారు అందుబాటులోకి రానుందని టొయోటా వెల్లడించింది.


Click it and Unblock the Notifications








