భారత్‌లో 1500 మంది ఉద్యోగాలు కల్పించనున్న టొయోటా

ఈ విస్తరణలో భాగంగా 2012 నాటికి భారత్‌లో 1,500 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించనున్నామని టికెఎమ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (కమర్షియల్) శేఖర్ విశ్వనాథన్ తెలిపారు. అంతేకాకుండా కొంత మంది కాంట్రాక్టు వర్కర్లను కూడా నియమించుకున్నామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం టికెఎమ్‌కు బెంగుళూరులో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ రెండు ప్లాంట్లలో సుమారు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 70 శాతం మంది వరకూ శాశ్వత ఉద్యోగులే ఉన్నారు.


Click it and Unblock the Notifications








