థాయ్ మార్కెట్ ఎఫెక్ట్: పక్క మార్కెట్లో ఆటో కంపెనీల కన్ను

Honda Plant
ప్రస్తుతం భారత్‌లో జపాన్ కంపెనీలను విడిభాగాల కొరత వేధిస్తోంది. జపాన్ ఆటో దిగ్గజాలైన టొయోటా కిర్లోస్కర్, హోండా సియోల్ కంపెనీలు ఆటో విడిభాగాల కోసం ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం అన్వేషిస్తున్నాయి. విడిభాగాల సరఫరాలో ఆసియాలోనే అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటైన థాయ్‌లాండ్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా విడిభాగాల సరఫరాకు అంతయరాయం ఏర్పడింది.

ఈ సరఫరా అంతరాయం కారణంగా తాము 800-1000 వాహనాలు లేదా మొత్తం ఉత్పత్తి 8-10 శాతం మేర నష్టపోవచ్చునని అంచనా వేస్తున్నట్లు టొయోటా పేర్కొంది. దేశీయ మార్కెట్లో టొయోటా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ఇన్నోవా, ఫార్చ్యూనర్ వాహనాల ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఉండేందు కోసం ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ప్లాంట్ల కోసం వెళ్లాల్సిన విడిభాగాలను భారత మార్కెట్‌కు దారి మళ్లిస్తోంది.

థాయ్‌లాండ్ వరదల కారణంగా హోండా కూడా భారీగా నష్టపోయింది. ఈ వరదల్లో థాయ్‌లాండ్‌లోని హోండా ప్లాంటు పూర్తిగా నీళ్లల్లో మునిగిపోయింది. మరోవైపు విడిభాగాల కొరత కారణంగా భారత మార్కెట్లో ఉత్పత్తికి ఆటంకం వాటిళ్లుతోంది. విడిభాగాల సరఫరా అంతరాయం వలన ఏర్పడిన ఉత్పత్తి కొరత కారణంగా కంపెనీ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ బుకింగ్‌లను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

విడిభాగాల కొరత కారణంగా హోండా సియోల్ 60-70 శాతానికి పైగా ఉత్పత్తిని నష్టపోతుంది. ఈ నేపథ్యంలో విడిభాగాల కోసం చైనా, జపాన్ మార్కెట్లను హోండా ఆశ్రయిస్తోంది. ఫార్చ్యూనర్, ఇన్నోవా మోడళ్ల ఇంజన్లలో ఉపయోగించే కీలక విడిభాగాలను టొయోటా థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే, హోండా కూడా అండర్-బాడీ పార్ట్స్, ఎలక్ట్రానిక్ పార్ట్‌లను ఈ మార్కెట్ నుండి దిగుమతి చేసుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 28, 2011, 14:27 [IST]
English summary
Flood crisis in Thailand is affecting auto component supply for Japanese carmaker like Toyota Kirloskar and Honda Siel. Now, these companies are looking for alternative markets for sourcing the parts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+