అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న టొయోటా వాహనాలు

Toyota Price Hike
మీరు టొయోటా వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనేయండి. ఈ ఒక్క నెల ఆలస్యం చేసినట్లయిచే ప్రస్తుత ధర కన్నా అధిక ధరను చెల్లించి మీ జేబులకు చిల్లు పెట్టుకున్న వారు అవుతారు. అసలు విషయం ఏంటంటే అక్టోబర్ 1 నుంచి తమ అన్ని రకాల ఉత్పత్తులపై 2 శాతం వరకూ ధరలను పెంచనున్నట్లు టొయెటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రకటించింది.

పెరుగుతున్న ముడి సరుకుల భారాన్ని వినియోగదారులపై మోపాలని టొయోటా నిర్ణయించింది. "అక్టోబర్ 1 నుండి ధరలను 1.5 శాతం నుండి 2 శాతం మేర పెంచుతాం. పెరుగుతున్న విడిభాగాల ధరలు మరియు యెన్ (జపాన్ కరెన్సీ) విలువ పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమ"ని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ వెల్లడించారు.

భారత్‌లో ఉత్పత్తి అవుతున్న అన్ని వాహనాల ధరలను పెంచుతామని ఆయన చెప్పారు. టికెమ్ ఇప్పటికే ఈ ఏడాది రెండు సార్లు (ఏప్రిల్, జులై) ధరలను మొత్తం 3 శాతం మేర పెంచింది. ఎతియోస్, కరోలా ఆల్టిస్ సెడాన్, ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ మరియు ఇన్నోవా ఎమ్‌యూవీ మోడళ్లను టొయోటా భారత్‌లో ఉత్పత్తి చేస్తుంది. కాగా.. సెప్టెంబర్ 9న డీజిల్ ఎతియోస్ సెడాన్ మరియు డీజిల్ ఎతియోస్ లివాలను టొయోటా భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 7, 2011, 14:10 [IST]
English summary
Japanese carmaker Toyota's Indian subsidiary Toyota Kirloskar Motor (TKM) said it will raise the prices of its vehicles by up to 2 per cent from October 1, 2011, due to rising raw material prices. Car makers have been troubled by increasing steel and rubber prices. Several of them have not increased prices fearing a drop in sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+