ఫార్చ్యూనర్ యానివర్స్‌రే ఎడిఎషన్‌ కేవలం 250 కార్లు మాత్రమే!

Toyota Fortuner
టొయోటా అందిస్తున్న హైఎండ్ వేరియంట్ కారు ఫార్చ్యూనర్‌ భారత్‌లోకి అడుగుపెట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా ఈ మోడల్‌లో వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. సరికొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) ఫార్చ్యూనర్‌‌ను కేవలం 250 కార్లు మాత్రమే యానివర్స్‌రే ఎడిఎషన్‌కు గుర్తుగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో ఫార్చ్యూనర్ యానివర్స్‌రే ఎడిఎషన్‌ రూ. 20,45,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రైస్ ట్యాగ్‌తో లభిస్తుంది.

భారత మార్కెట్లో విడుదలైన ఒక్క ఏడాదిలో 10,000కు పైగా ఫార్చ్యూనర్ కార్లు అమ్ముడుకావడంతో టొయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్చ్యూనర్ యానివర్స్‌రే ఎడిఎషన్‌‌ను భారత్‌కు తీసుకురావాలని సన్నాహాలు చేస్తుంది. ఆగస్టు 24, 2009లో విడుదలైన ఈ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ కారు, ఈ కార్ విభాగంలో దాదాపు 60 శాతం మార్కెట్ వాటాను కొనసాగిస్తూ వస్తుంది. కాగా.. ఫార్చ్యూనర్‌లో కంపెనీ కొద్దిపాటి మార్పులు చేసి ఫార్చ్యూనర్ యానివర్స్‌రే ఎడిఎషన్‌‌గా మార్చింది.

ఈ మార్పుల్లో భాగంగా.. ఫ్రంట్ బంపర్ స్పాయిలర్, రియర్ బంపర్, రియర్ రూఫ్, క్రోమ్ ఫినిషింగ్‌తో కోటింగ్ చేసిన ఎగ్జాస్ట్ ముఫ్లర్‌తో అత్యంత స్టైలిష్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఇంకా ఈ కారు లోపలి భాగం విలాసవంతమైన ఫీచర్లను కలుగి ఉంటుంది. టొయోటా ఫార్చ్యూనర్ యానివర్స్‌రే ఎడిఎషన్‌ కేవలం 250 యూనిట్లు, అవి కూడా కేవలం పెరల్ వైట్ రంగులో మాత్రమే లభ్యమవుతాయి. ఈ 250 కార్లపై యానివర్స్‌రే ఎడిఎషన్‌ బ్యాడ్జ్‌ కూడా దర్శనమివ్వనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 30, 2011, 14:52 [IST]
English summary
Toyota Kirloskar Motor is planning to introduce the Fortuner Anniversary Edition to immortalize the occasion of vehicle’s first anniversary in India. The new SUV Fortuner is an Anniversary Edition and only 250 of its units will be available in the market with a price tag of Rs. 20,45,000 (Ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+