కార్ల ధరలను రూ. 20,000 వరకూ పెంచిన టొయోటా కిర్లోస్కర్

Toyota Fortuner
అందరూ ఊహించినట్లుగానే ఆటోమొబైల్ ఏప్రిల్ నెల ప్రారంభమవుతూనే ధరల పెంపుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) అందిస్తున్న బహుళ ప్రయోజనాల వాహన (ఎమ్‌యూవీ)తో ఇతర కీలక మోడళ్లపై ధరలను రూ. 20,000 వరకూ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్నోవా, కరోలా ఆల్టిస్‌, ఫార్చ్యూనర్‌ మోడళ్లపై ధరల పెంపు 1-1.5 శాతం మధ్య ఉంది. ఈ పెరుగుదల ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ వివరించింది.

ఇన్నోవా మోడల్‌పై పెరిగిన ధరల శ్రేణి రూ. 12,557 నుంచి రూ. 18,424 మధ్య ఉంది. ప్రస్తుతం ఇది రూ. 8.27 లక్షల నుంచి రూ. 12.18 లక్షల మధ్య లభిస్తుంది. అలాగే.. కరోలా ఆల్టిస్‌ డీజిల్‌ మోడల్‌ వేరియంట్‌ను బట్టి ధరల పెంపు రూ. 14,100 నుంచి రూ. 17,700 మధ్య ఉంది. ఈ కారు ధర రూ. 8.27 లక్షల నుంచి రూ. 12.18 లక్షల మధ్య ఉంది.

కరోలా ఆల్టిస్‌ పెట్రోల్‌ వెర్షన్‌పై రూ. 10,400 నుంచి రూ. 14,500 మేర ధర పెరిగింది. ఈ వేరియంట్ మార్కెట్లో రూ. 10.28 లక్షల నుంచి రూ. 14.38 లక్షల మధ్య లభిస్తుంది. ఇకపోతే స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ) టొయోటా ఫార్చ్యూనర్‌‌పై దాదాపు రూ.20,000 వరకూ పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత మార్కెట్లో టొయోటా ఫార్య్చూనర్ ధర రూ. 19.94 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 2, 2011, 12:34 [IST]
English summary
Leading automobile company Toyota Kirloskar Motor said it has hiked the prices of its key models, including Innova, Corolla Altis and Fortuner by up to Rs 20,000. The new price hike will be effective from April 1, 2011 company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+