కర్ణాటకలో రెండవ ప్లాంటు సామర్థ్యం పెంపు: టొయోటా

Toyota Etios Liva
జపాన్‌కు చెందిన టొయోటా మరియు భారత్‌కు చెందిన కిర్లోస్కర్ మోటార్ కంపెనీల జాయింట్ వెంచర్ "టొయోటా కిర్లోస్కర్ మోటార్స్" (టికెఎమ్) ఇటీవలే కర్ణాటకలో ప్రారంభించిన తమ రెండవ ప్లాంటును మరింత విస్తరించి ఎతియోస్ మరియు లివా వంటి మోడళ్లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. "రెండవ ప్లాంటు యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని వార్షికంగా 70,000 యూనిట్ల నుంచి 1.20 యూనిట్లకు పెంచాలని భావిస్తున్నామ"ని టికెఎమ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్) ఎస్ షెట్టి తెలిపారు.

ఈ విస్తరణ కోసం రూ. 215 కోట్లు అవసరమవుతాయని వచ్చే ఏడాది రెండవ త్రైమాసికం నాటికి ఇది పూర్తవుతుందని ఆయన చెప్పారు. బెంగుళూరులో తమ తొలి కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు లివాను విడుదల సందర్భంగా షెట్టి మాట్లాడుతూ.. కంపెనీ ఇప్పటి వరకూ 21,000 యూనిట్ల ఎతియోస్‌లను విక్రయించిందని, ఈ ఏడాది ఎతియోస్ మరియు లివా రెండింటినీ కలిపి 60,000 యూనిట్లు విక్రయించగలమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఈ ఏడాది చివరి నాటికి ప్రస్తుతం 150గా ఉన్న టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డీలర్‌షిప్‌ల సంఖ్యను 170కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 7, 2011, 12:37 [IST]
English summary
In Karnataka, Toyota Kirloskar Motors will expand the capacity of its second plant that manufactures models like the Etios and Liva. Toyota Kirloskar Motors VP (Sales) S Shetty said that the capacity of the second plant would be increased from 70,000 units per annum to 1.20 lakh units per annum.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+