జపాన్ సునామీ ప్రభావం ఉన్నా మంచి విక్రయాలను ప్రకటించిన టొయోటా

Toyota-Honda
ఓవైపు జపాన్ సునామీ భూతం వెంటాడుతున్నప్పటికీ ఏప్రిల్ నెలలో జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం, ప్రపంచపు నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ టొయోటా మోటార్ కార్పోరేషన్, భారతీయ అనుంబంధ సంస్థ అయిన "టొయోటా కిర్లోస్కర్ మోటార్" (టికెఎమ్) భారీ వృద్ధిని కనబరిచింది. ఏప్రిల్ 2011లో టొయోటా కిర్లోస్కర్ విక్రయాలు 61 శాతం వృద్ధి చెందాయి. ఈ నెలలో కంపెనీ మొత్తం 9,681 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 6,001 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. టొయోటా అందిస్తున్న ఎతియోస్‌కు వచ్చిన మంచి డిమాండు కారణంగానే ఇంత భారీ వృద్ధిని సాధించగలిగామని, ఏప్రిల్ నెల మొత్తం విక్రయాలలో 4,657 యూనిట్లు ఎతియోస్ కార్లే ఉన్నాయని టికెఎమ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ వెల్లడించారు.

అయితే.. జపాన్‌కు చెందిన మరో ఆటో దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్ భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా సియోల్ కార్స్ ఇండియా (హెచ్ఎస్‌సిఐ) ఏప్రిల్ నెల విక్రయాలు మాత్రం భారీగా పడిపోయాయి. ఏప్రిల్ 2011లో కంపెనీ కేవలం 2,012 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. అంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ విక్రయాలు 43.76 శాతానికి పడిపోయాయి. ఏప్రిల్ 2010లో కంపెనీ మొత్తం 3,578 యూనిట్లను విక్రయించినట్లు హెచ్ఎస్‌సిఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 2011 విక్రయాలలో 1,542 హెండా సిటీ సెడాన్ కార్లు, 253 సివిక్ ప్రిమీయం సెడాన్ కార్లు, 112 జాజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు, 83 అకార్డ్ లగ్జరీ సెడాన్ కార్లు, 22 సిఆర్-వీ స్పోర్ట్ యుటిలిటీ కార్లు ఉన్నట్లు కంపెనీ వివరించింది. జపాన్ సునామీ కారణంగా కంపెనీ ఉత్పత్తిని సగానికిపై తగ్గించిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Tuesday, May 3, 2011, 11:12 [IST]
English summary
Due to the earthquake and tsunami that hit Japan in March, the Automobiles Company's are reduced production, which results that auto sales declined in April 2011. Car maker Honda Siel Cars India today reported a 43.76% decline in sales at 2,012 units in April, over the same month an year ago.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+