ఇన్నోవాకు దిగువన అవాంజాను ప్రవేశపెట్టనున్న టొయోటా

ఎంట్రీ-లెవల్ ఎమ్‌పివి సెగ్మెంట్లో విడుదల కానున్న టొయోటా అవాంజా.. మహీంద్రా జైలో, చెవర్లే తవేరా వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఈ ఏడాది చివరిలోగా భారత్‌లో అవాంజా ఉత్పత్తిని ప్రారంభించాలని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ అంచనా వేస్తుంది. ఈ ఎమ్‌పివి డిజైన్‌ను ఇన్నోవాతో పోటీపడకుండా ఉండేలా రూపొందించారు.
పరిమాణంలో ఇన్నోవా కన్నా చిన్నది గానూ, సీటింగ్ సామర్థ్యంలో ఇన్నోవా కన్నా తక్కువగానూ మరియు ఇంజన్ విషయంలో కూడా ఇన్నోవా కంటే చిన్న ఇంజన్‌ను ఇందులో ఉపయోగించారు. అయితే, దీన్ని ఇన్నోవా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే డిజైన్ చేశారు. ఇక టొయోటా అవాంజా ధర విషయానికి వస్తే.. ఇది దాదాపు రూ.7 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








