ఎతియోస్‌లో డీజిల్ వేరియంట్లను విడుదల చేయనున్న టొయోటా

గడచిన జులై నెల విక్రయాలను గమనిస్తే.. టొయోటా 99 శాతం వృద్ధిని సాధించి 13,592 వాహనాలను విక్రయించింది. అంతకు ముందే ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు కేవలం 6,834 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. దీనిపై కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మార్కెటింగ్ సందీప్ సింగ్ మాట్లాడుతూ.. ఎతియోస్ మరియు ఎతియోస్ లివా మోడళ్లకు వినియోగదారుల నుంచి చాలా మంచి స్పందన లభిస్తోందని అన్నారు.
టొయోటాపై విశ్వాసం ఉంచినందుకు తమ వినియోగదారులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నామని, ఈ మొత్తం అమ్మాకాలలో 4,095 ఎతియోస్ కార్లు అమ్ముడైతే, 2,551 ఎతియోస్ లివా కార్లు అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు. ఈ రెండు మోడళ్లకు మార్కెట్ నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన కారణంగా ఈ రెండు మోడళ్లలోనూ డీజిల్ వేరియంట్లను విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. రానున్న దీపావళి నాటికి ఎతియోస్ డీజిల్ కార్లు మార్కెట్లో సందడి చేసే ఆస్కారం.


Click it and Unblock the Notifications








