త్వరలో భారత్‌లో కూడా విడుదల కానున్న కొత్త ఇన్నోవా

మలేషియాలో పెట్రోల్ వాహనాల వినియోగం అధికం. టొయోటా ఇన్నోవా ఫేస్‌లిఫ్ట్‌లో ఉపయోగించిన 1టిఆర్-ఎఫ్ఈ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5600 ఆర్‌పిఎమ్ వద్ద 136 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 182 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఎస్‌యూవీ/ఎమ్‌యూవీ మార్కెట్లో కూడా టొయోటా ఇన్నోవాకు పోటీగా వివిధ రకాలు మోడళ్లు వస్తుండటంతో ఇన్నోవా స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ఇందులో సరికొత్త వెర్షన్‌ను కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల చేయనుంది.
ఫేస్‌లిఫ్ట్ టొయోటా ఇన్నోవాలో ఉండే కొన్ని ప్రధాన ఫీచర్లు:
* రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్
* సరికొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్
* కొత్త బాడీ గ్రాఫిక్స్
* బాడీ కలర్డ్ బి, సి పిల్లర్స్
* బ్రేక్ లైట్లతో కూడిన టెయిల్ ల్యాంప్స్
* టర్న్ ఇండికేటర్స్ మరియు రివర్స్ ఫాగ్‌ల్యాంప్
* కొత్త 4-స్పోక్ వీల్ డిజైన్ కలిగిన స్టీరింగ్
* సెంటర్ కన్సోల్‌పై పెద్ద ఏసి వెంట్స్ (రంధ్రాలు)
* పెద్ద స్క్రీన్ కలిగిన మ్యూజిక్ సిస్టమ్
* విశాలమైన ఇంటీరియర్


Click it and Unblock the Notifications








