లగ్జరీ కారు 'లెక్సస్‌'ను భారత్‌కు తీసుకురానున్న టొయోటా

Toyota Lexus
బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి పోటీదారులు భారత లగ్జరీ కార్ మార్కెట్లో అనుభవిస్తున్న విలాసాలను దృష్టిలో ఉంచుకొని టొయోటా కూడా వీటి సరసన చేరేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశీయ వినియోగదారులకు తమ లగ్జరీ కారు లెక్సస్‌ను రుచి చూపించాలని టొయోటా భావిస్తుంది. అంతేకాకుండా.. ఫోక్స్‌వ్యాగన్ మాదిరిగా భారత్‌లో కార్ ఫైనాన్స్ సేవలను అందించేందుకు 'టొయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్' అనే ఓ కార్ ఫైనాన్స్ డివిజన్‌ను ఏర్పాటు చేసి విక్రయాలను మరింత పెంచుకోవాలని నిర్ణయించుకుంది.

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి నగాకవా మాట్లాడుతూ.. భారత్‌లో విస్తరణ కోసం కొత్త ప్రణాళికలను కంపెనీ పరిశీలిస్తోందని, ఇందులో భాగంగాగనే.. లెక్సస్ కారును భారత్‌కు తీసుకు వచ్చే అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. టొయోటాకు ఇండియా ఒక కీలక మార్కెట్ అని, భారత్‌లో తమ ప్రస్థానాన్ని పెంచుకునేందుకు అలాగే ఇక్కడి వినియోగదారులుక మరిన్ని ఉత్పత్తులు అందించే విషయాలపై దృష్టి సారించామని కంపెనీ ఎండి (సేల్స్ అండ్ మార్కెటింగ్) సందీప్ సింగ్ వెల్లడించారు.

భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే అంశంపై టొయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పష్టంగా ఉందని, ఈ విషయంలో తమ మార్కెట్ అధ్యయనం దాదాపుగా పూర్తయిందని, ఇక తుది నిర్ణయం మాత్రమే మిగిలి ఉందని కంపెనీ పేర్కొంది. భారత్‌లో ఆటోమొబైల్ కంపెనీలే ఇలా స్వతహాగా ఫైనాన్స్ సేవలు అందిస్తున్న వారిలో ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా.. గురువారం దేశీయ మార్కెట్లోకి టొయోటా తమ అప్‌గ్రేడెడ్ సెడాన్ కారు కరోలా ఆల్టిస్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, June 17, 2011, 14:13 [IST]
English summary
Japanese auto gaint Toyota Motor Co. likely to launch its luxury sedan car Lexus in Indian luxury car market. Company also looking to kick start its car finance division, Toyota Financial Services, to boost sale volume.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+