కొత్త వెర్షన్ కరోలా ఆల్టిస్ సెడాన్‌ను విడుదల చేసిన టొయోటా

పెట్రోల్ వేరియంట్లో లభించే కరోలా ఆల్టిస్ కారు ధరల శ్రేణి రూ. 10.53 రూ. 14.77 లక్షల మధ్య ఉండగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 11.46 లక్షల నుంచి రూ. 14.55 లక్షల మధ్యలో ఉంది. ఈ ధరలన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ఢిల్లీ. కరోలా 2003లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 70,000 కరోలా కార్లు అమ్ముడయినట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి నగాకవా వెల్లడించారు. గడచిన సంవత్సరంలో కంపెనీ 10,400 పాత వెర్షన్ కరోలా ఆల్టిస్ కార్లను విక్రయించగా.. ఈ ఏడాది కనీసం 11,500 యూనిట్లను అమ్మగలమని అంచనా వేస్తుంది.


Click it and Unblock the Notifications








