స్విఫ్ట్, పోలో, మైక్రా మోడళ్లను ఢీకొట్టేందుకు వస్తున్న లివా

కాగా.. భారత మార్కెట్లో లివా ధర రూ. 4 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లతో కూడిన టాప్-ఎండ్ వేరియంట్ లివా కారు ధర రూ. 55.5 లక్షల నుంచి 6 లక్షల మేర ఉండే అవకాశం ఉంది.
ప్రపంచపు టాప్ కార్‌మేకర్ నుంచి 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తున్న ఈ కారు ధర విషయంలో ఇతర పోటీదారులకు చెమటలు పట్టించనుంది. ఈ సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, ఫోక్స్‌వ్యాగన్ పోలో, నిస్సాన్ మైక్రా, స్కొడా ఫ్యాబియా మరియు ఫియట్ పుంటో మోడళ్ల ప్రారంభ రూ. 4.3 నుంచి రూ. 8 లక్షలకు పైగా ఉన్నాయి. మరోవైపు లివా జోరుకు చెక్ పెట్టేందుకు జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్ కూడా తమ చిన్న కారు 'బ్రయో'ను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








