సమస్యలతో కార్లను వెనక్కి పిలిపిస్తున్న ఆటో కంపెనీలు

Toyota recall
మా కార్లను కొనండి.. అత్యుత్తమ సర్వీసులను అందిస్తాం.. అంటూ ఊదరగొడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు క(న)ష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నాయి. వినియోగదారుల విశ్వాన్నీ కోల్పోతున్నాయి. లోపపూరితమై లేదా నాసిరకం పరికరాలు ఉపయోగించి తయారు చేసిన కార్లు మార్కెట్లో విక్రయించిన కొద్దిరోజులకే తిరిగి వెనక్కు (రీకాల్) పిలిపించుకుంటున్నాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కార్లను రీకాల్ చేయడంలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్న కంపెనీ జపాన్‌కు చెందిన టొయాటా మోటార్ కార్పోరేషన్‌.

ఇటీవల అదే దేశానికి చెందిన హోండా మోటార్ కంపెనీ కూడా 57,853 "హోండా సిటీ" కార్లను రీకాల్ చేసిన సంఘటన జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే టొయోటా ఏకంగా 90 లక్షల కార్లను రీకాల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 2009 చివరి భాగంలోనూ అలాగే ఫిబ్రవరి 2010లోనూ తయారు చేసిన వాహనాలను టొయోటా రీకాల్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదే గనుక జరుగితే కంపెనీకు రెండు వందల కోట్ల డాలర్ల నష్టం వాటిళ్లనుంది. ఇప్పటికే కంపెనీ విక్రయాలు మందగించి కోలుకోవడానికి కష్టపడుతున్న తరుణంలో టొయోటాకు ఇది గోటి పుండు మీద గొడ్డలిపెట్టులా మారనుంది.

టొయోటా రీకాల్ చేయనున్న వాహనాలలో జపాన్ నుంచి 1,67,000 యూనిట్లను, ఆసియా నుంచి 2,20,000 యూనిట్లను, చైనా నుంచి 1,56,000 యూనిట్లను రీకాల్ చేయనున్నట్లు కంపెనీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతం(2010)లో దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మారుతి కూడా 40,000 ఏ-స్టార్ కార్లను ఇంధన ట్యాంక్ లోపం వల్ల వెనక్కు పిలిపించింది. అంతేకాకుండా ప్రజల కారు అంటూ టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన బుజ్జి కారు "నానో"కు ఫైర్ సేఫ్టీ వ్యవస్థను అమర్చిన సంగతి తెలిసిందే. అయితే టాటా మాత్రం రీకాల్ అని ప్రకటించకుండా నానో యజమానులు మరోసారి కారును చెక్‌ చేసుకోమని తెలిపింది. ఏదేతైనేం రీకాల్ వల్ల ఇటు ఆటోమొబైల్ కంపెనీలు నష్టపోవడమే కాకుండా తమ బ్రాండ్ ఇమేజ్‌ను కూడా పాడుచేసుకున్నట్లు అవుతుంది. ఇందుకు టొయోటా, నానో కార్లే చక్కని ఉదాహరణలు.

More from DriveSpark

Article Published On: Saturday, February 19, 2011, 17:05 [IST]
English summary
The Japanese car maker Toyota has now made up its mind to recall 9 million vehicles coming under the period of late 2009 and February 2010. The lion’s share of such recall was found in the US market leading to the revenue loss of $2 billion and fall in the normal sale volume, said the company report.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+