ఎతియోస్‌ను బ్రెజిల్ ఉత్పత్తి చేసేందుకు టొయోటా సన్నాహాలు

Toyota Etios Liva
ప్రత్యేకించి భారత మార్కెట్ కోసం రూపొందించిన ఎతియోస్ సెడాన్ కారును బ్రెజిల్ మార్కెట్లో కూడా ఉత్పత్తి చేయాలని జపాన్ ఆటో దిగ్గజం టొయోటా మోటార్ కార్పేరేషన్ సన్నాహాలు చేస్తుంది. "ఆగస్ట్ 2010లో బ్రెజిల్‌లోని సొరొకబాలో ఓ వాహన ప్లాంటును నిర్మించాలని టొయోటా నిర్ణయించిది. భారత్‌లో విడుదల చేసిన చిన్న కారు ఎతియోస్ మోడల్‌ను ఈ ప్లాంటులో ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ ప్లాంటు సామర్థ్యం సాలీనా 70,000 యూనిట్లు. 2012 నాటికి ఈ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంద"ని టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఓ ప్రకటనలో పేర్కొంది.

టొయోటా మోటార్ కార్పోరేషన్ భారత్‌కు చెందిన కిర్లస్కర్ గ్రూపుతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాగా.. గడచిన డిసెంబర్ నెలలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) దేశీయ మార్కెట్ కోసం రూపొందించిన ఎతియోస్ సెడాన్ కారును విడుదల చేసింది. ఈ మోడల్‌క మార్కెట్ నుంచి భారీ స్పందన రావడంతో గత నెల ఇందులో హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ ఎతియోస్ లివా మోడల్‌ను విడుదల చేసింది. దాదాపు 4,000 మంది ఇజనీర్లు ఐదేళ్లపాటు శ్రమించి ఎతియోస్‌ను అభివృద్ధి చేశారు.

ఎతియోస్ సెడాన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మరియు లివా హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రలో ఇంజన్‌తో లభిస్తుంది. ఎతియోస్‌కు పెరుగుతున్న డిమాండును అందుకునేందుకు బెంగుళూరులో రూ. 3,200 కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంటును కంపెనీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. రెండో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా ఏటా 70,000 యూనిట్ల నుంచి 120,000 యూనిట్లకు పెంచింది. ప్రస్తుతం టొయోటా ప్రతినెలా 6,000 యూనిట్ల ఎతియోస్ మరియు లివాలను ఉత్పత్తి చేస్తుండగా, సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్యను 8,000లకు పెంచనుంది. ఈ ఏడాది 60,000 ఎతియోస్ బ్రాండ్ వాహనాలకు విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 20 వేలకు పైగా లివా హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయించాలని కంపెనీ బావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, July 18, 2011, 10:08 [IST]
English summary
Japanese auto gaint Toyota Motor Corporation plans to start producing its Etios in Brazil by late 2012. Etios is specifically developed for the Indian market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+