టొయోటా మరో షాక్.: చైనాలో 5,200 లెక్సస్ కార్ల రీకాల్

Toyota
టొయోటా మోటార్ కంపెనీకు 2011 సంవత్సరం అంతగా కలిసివచ్చినట్లు లేదు. టొయైటాకు ఒక సమస్య ముగిసేలోపే మరో సమస్య ఎదురవుతుంది. అమెరికా రీకాల్ వార్త మరువక ముందే చైనాలో మరో రీకాల్ చేయనున్నట్లు సమాచారం. చైనాలో దిగుమతి చేసుకున్న టొయోటా కంపెనీకు చెందిన 5,202 లెక్సస్ కార్లను కంపెనీ వెనక్కు పిలిపించనుంది. గ్యాస్ పెడలింగ్ సమస్య కారణంగా ఈ వాహనాలను రీకాల్ చేయనున్నట్లు చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిటీ సూపర్‌విజన్, ఇన్సెపెక్షన్ అండ్ క్వారంటైన్ (ఏక్యూఎస్ఐక్యూ) పేర్కొంది.

చైనాకు చెందిన క్వాలిటీ వాచ్‌డాగ్ అయిన ఏక్యూఎస్ఐక్యూ లెక్సస్ కార్లలో తలెత్తిన ఈ సమస్య గురించి విచారించిన పిదప ఈ రీకాల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అస్సలే సమస్యలతో సతమతమవుతున్న టొయోటా కంపెనీకు ఈ కొత్త చిక్కులు మరింత భారంగా మారనున్నాయి. ఫబ్రవరి 2003, జులై 2006 మధ్య కాలంలో తయారైన లెక్సస్ ఆర్ఎక్స్300/350 కార్లను వచ్చే నెల మార్చి 23 నుంచి రీకాల్ చేస్తున్నట్లు టొయోటా ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Sunday, February 27, 2011, 10:20 [IST]
English summary
Toyota Motors will recall 5,202 imported Lexus cars in China to fix a malfunctioning gas-pedal problem beginning March 23, China's General Administration of Quality Supervision, Inspection and Quarantine (AQSIQ) has said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+