ఆటోమొబైల్ పరిశ్రమను వెంటాడుతున్న రీకాల్ భూతం

అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్ కంపెనీ తమ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎఫ్-150 పిక్-అప్ మినీ ట్రక్ (1,44,000)లను రీకాల్ చేసి ఒక్క రోజు కూడా గడవక ముందే తాజాగా టొయోటా కంపెనీ మూడు రీకాల్‌లను జారీ చేసింది. టొయోటా తాజాగా వెనక్కు పిలిపిస్తున్న వాహనాల సంఖ్య దాదాపు 22 లక్షలు. దీంతో ఆటోమొబైల్ రంగంలో ఇప్పటి వరకూ అధికంగా వానాలను రీకాల్ చేసిన కంపెనీలలో టొయోటా కూడా చేరిపోనుంది. ఇటీవల భారత్‌లో హోండా మోటార్ కంపెనీ తమ సిటీ సెడాన్ కారును రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.
యాక్సిలరేటల్ పెడల్ సమస్య కారణంగా ఈ వాహనాలను వెనక్కు పిలుస్తున్నట్లు టొయోటా పేర్కొంది. ఈ రీకాల్‌లో 2006-10 మధ్య కాలంలో తయారైన 7,61,000 ఆర్‌ఏవీ4 క్రాస్‌ఓవర్ కార్లను, 2009లో తయారైన క్యామ్రే కార్లు ఉన్నాయి. అయితే కంపెనీ తాజా రీకాల్‌లో భారత వాహనాలు మాత్రం లేవని, భారత్‌లో విక్రయించిన మోడళ్లు సురక్షితంగా ఉన్నాయని టొయోటా మోటార్ కార్పోరేషన్ భారత అనుబంధ సంస్థ అయిన టొయోటా కిర్లోస్కర్ మోటర్ పేర్కొంది. దీంతో భారత వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నట్లుయింది.


Click it and Unblock the Notifications








