ఐదు లక్షలకు పైగా కార్లను రీకాల్ చేసిన టొయోటా

Toyota Recall
ప్రపంచపు ఆటో దిగ్గజాలలో ఒకటైన టొయోటా మరోసారి రీకాల్ జారీ చేసింది. అమెరికాలో విక్రయించిన టొయోటా, లెక్సస్ (టొయోటా ప్రీమియం కార్ బ్రాండ్) దాదాపు 5.5 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు టొయోటా పేర్కొంది. ఇంజన్‌లో అమర్చిన లోపపూరితమైన విడిభాగం కారణంగా ఈ రీకాల్ చేస్తున్నట్లు టొయోటా పేర్కొంది.

క్రాంక్‌షఫ్ట్ పుల్లీ ఇంజన్ లోపం కారణంగా పవర్ స్టీరింగ్ పనిచేయకపోతుండటంతో ఈ రీకాల్ చేస్తున్నట్లు టొయోటా తెలిపింది. అయితే, ఈ సమస్య కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదాలు సంభవించలేదని టొయోటా స్పష్టం చేసింది. కాగా.. ఈ రీకాల్‌లో 2,83,200 టొయోటా కార్లు, 1,37,000 లెక్సస్ కార్లు ఉన్నాయి.

టొయోటా ఇప్పటికే ఇలాంటి ఎన్నో రీకాల్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేవలం అమెరికాలోనే కాకుండా జపాన్‌లో 38,000 కార్లను, ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లలో 25,000 కార్లను రీకాల్ చేసినట్లు టొయోటా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వీటిల్లో టొయోటా క్యామ్రీ, హైలాండర్, సియన్నా వంటి మోడళ్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 11, 2011, 15:31 [IST]
English summary
Japanese carmaker Toyota Motor Corp has announced yet another recall in the United states. The recall is now due to a faulty crankshaft pulley engine used in several Toyota and Lexus branded cars. Toyota has stated the recall will be effective about 5.5 lakh cars mostly in the US.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+