జపాన్‌లో హైబ్రిడ్ కార్ల ఉత్పత్తిని పునఃప్రారంభించనున్న టొయోటా

Japan Tsunami
అతి భయానక భూకంపం, సునామీల తర్వాత జపాన్‌లో పరిస్థితి మెల్లి మెల్లిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో పలు వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను యథావిథిగా కొనసాగించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఇదే కోవలో జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా మోటార్ కార్పోరేషన్ (టిఎమ్‌సి) జపాన్ ప్లాంట్లలో మూడు హైబ్రిడ్ మోడళ్ల ఉత్పత్తిని పునఃప్రారంభించనున్నట్లు పేర్కొంది. ప్రియుస్, లెక్సస్ హెచ్ఎస్250హెచ్, లెక్సస్ సిటి200హెచ్ అనే హైబ్రిడ్ కార్ల ఉత్పత్తిని మార్చి 28 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

సెంట్రల్ జపాన్‌లో ఉన్న సుసుమీ ఫ్యాక్టరీలో అలాగే.. సౌత్ జపాన్‌లో ఉన్న టొయోటా మోటార్ కైషు ప్లాంట్లలో ఈ మూడు హైబ్రిడ్ మోడల్ కార్ల ఉత్పత్తిని యథావిథిగా కొనసాగించనున్నామని కంపెనీ అధికార ప్రతినిధి షివోరి హషిమోటో తెలిపారు. కనీసం ఈ శనివారం వరకూ జపాన్‌లో ఉన్న 12 ప్రధాన టొయోటా అసెంబ్లింగ్ ప్లాంట్లలో ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనుంది. దీని ఫలితంగా 1,40,000 వాహనాల ఉత్పత్తిని టొయోటా నష్టపోనుంది. ఉత్పత్తి సమయంలో విడిభాగాల లభ్యతను జాగ్రత్తగా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, March 25, 2011, 16:46 [IST]
English summary
After a massive earthquake, tsunami in Japan, Toyota Motor Corp said it would restart production of three hybrid models. March 28 onwards company would resume production of its hybrid cars Prius, Lexus HS250h and Lexus CT200h.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+