మే 20 నుంచి సాధారణ ఉత్పత్తిని చేపట్టనున్న టొయోటా

ఇప్పటి వరకూ కొరతగా ఉన్న విడిభాగాలు రానున్న రోజుల్లో మెరుగుపడతాయని, అందుకే తాము ఉత్పత్తి విషయంలో అంచనాల కన్నా ముందుగానే సాధారణ పరిస్థితి నెలకొనగలదని భావిస్తున్నామని టికెఎమ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (కమర్షియల్) శేఖర్ విశ్వనాథన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో విడిభాగాల కొరత నేపథ్యంలో కంపెనీ ఏప్రిల్ 25 నుంచి జూన్ 4 మధ్య కాలంలో సోమ, శని వారాలలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసేది. ఫలితంగా అన్ని మోడళ్లపై దాదాపు 10,000 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయామని, దీంతో ఒక్కో వాహణంపై ఆదాయంలో సగటున రూ. 6,50,000 నష్టం వాటిళ్లందిని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications








