జపాన్‌లోని అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని ప్రారంభించిన టొయోటా

పూర్తి స్థాయిలో ఉత్పత్తి ఎప్పటి నుండి కొనసాంగుతుందనే విషయంపై కంపెనీ సంశయంలో ఉంది. ఈ ప్రకృతి భీభత్సం తర్వాత మూడు ప్లాంట్లలో పరిమిత ఉత్పత్తిని ప్రారభించిన ఏకైక ఆటో కంపెనీ టొయోటానే. వాహనాల తయారీలో ఉపయోగించే 150 వివిధ రకాల విడిభాగాలు లభ్యం కాకపోవడంతో టొయోటా భారీగా ఉత్పత్తిని నష్టపోయింది. మార్చి 11 నుంచి టొయోటా ఇప్పటి వరకూ 2,60,000 కార్ల ఉత్పత్తిని నష్టపోయినట్లు కంపెనీ ప్రతనిధి ఒకరు వెల్లడించారు.
కాగా.. జపాన్‌లోని మియాగీలో టొయోటా కొత్తగా నిర్మించిన ఫ్యాక్టరీ ఈ ప్రకృతి భీభత్సం కారణంగా.. భారీగా దెబ్బతిన్న వాటిలో ఒకటి. ఈ ప్రాంతంలో దాదాపు 8,400 మంది ప్రజలు మరణించారు. ఈ ప్లాంటులో పనిచేస్తున్న 900 మంది వర్కర్లు సోమవారం ఒక నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు నివాళులు అర్పించి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. దాదాపు 28,000 ప్రజలను జపాన్ భుకంపం, సునామీలు బలి తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications








