ఇండియాలో 2,000 మంది ఉద్యోగ అవకాశాలు: టొయోటా

వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా వివిధ కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి తమకు పటిష్టమైన మ్యాన్‌పవర్ కావాల్సి వస్తుందని, గడచిన రెండేళ్లలో ఉన్నత స్థానాల్లో ఉండే ఉద్యోగులు కంపెనీను వదిలిపెట్టి పోవడం భారీగా పెరిగిందని, ఇప్పుడు దాన్ని తగ్గించాలనుకుంటున్నామని టొయోటా కిర్లోస్కర్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి నగాకవా తెలిపారు. గడచిన రెండేళ్లలలో టికెఎమ్ 2,000 మంది ఉద్యోగులను చేర్చుకోవడంతో కంపెనీ మ్యాన్‌పవర్ సామర్థ్యం 5,000లకు పెరిగింది.
అయితే.. టొయోటా పోటీదారులైన ఫోక్స్‌వ్యాగన్, హోండా, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, హ్యుందాయ్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులు ఇతర సంస్థలకు తరలి వెళ్లకుండా ఉండేందుకు ప్రోత్సాహకర జీతాలను అందిస్తున్నాయి. పరిశ్రమ నిపుణల అంచనాల ప్రకారం, ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమలో 130 లక్షల మంది పనిచేస్తుండగా, 2016 నాటికి 250 లక్షలకు చేరుతుందని అంచనా. వృద్ధి రేటు సంక్లిష్టతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిపుణులైన సిబ్బంది అవసరమని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








