అప్‌గ్రేడెడ్ ఇన్నోవాను విడుదల చేసిన టొయోటా కిర్లోస్కర్

ప్రస్తుతం టొయోటా ఇన్నోవాకు పోటీగా ఈ సెగ్మెంట్లో ఎన్ని మోడళ్లు వచ్చినప్పటికీ, ఇన్నోవాకు గట్టి పోటీని ఇవ్వలేకపోయాయి. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో టొయోటా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు గానూ ఇన్నోవా ఎమ్‌యూవీకి అదనపు హంగులు దిద్ది మరింత సౌకర్యవంతంగా రూపొందించి. వచ్చే జవరిలో జరగనున్న 2012 ఆటో ఎక్స్‌పో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, టొయోటా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రయస్ హైబ్రిడ్ సెడాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన ఓ హైబ్రిడ్ కారు "ఆక్వా"ను కూడా కంపెనీ విడుదల చేసింది. డ్యూయెల్ పవర్‌తో పనిచేసే ఆక్వా హైబ్రిడ్ కారు ప్రతి లీటర్ పెట్రోల్‌కు 35.4 కి.మీ. మైలేజీనిస్తుంది. ప్రపంచంలోనే ఇది అత్యధికంగా మైలేజీనిచ్చే హైబ్రిడ్ కారని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








