అమెరికా మార్కెట్లో 2012 క్యామ్రేను విడుదల చేసిన టొయోటా

2012 Toyota Camry
జపాన్ ఆటో దిగ్గజం టొయోటా మోటార్ కార్పోరేషన్ అందిస్తోన్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ 'క్యామ్రే'లో ఓ కొత్త వెర్షన్‌ను కంపెనీ అమెరికా మార్కెట్లో ఆవిష్కరించింది. అమెరికాలో టొయోటా నుంచి అత్యుత్తమంగా అమ్ముడవుతున్న కారు క్యామ్రేలో ఏడవ తరం (సెవన్త్ జనరేషన్) 2012 క్యామ్రే సెడాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ కారును కేవలం అమెరికా మార్కెట్లోనే టొయోటా విడుదల చేసింది, ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఇది డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది.

బేసిక్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేకుండా, చాలా వరకూ కాస్మోటిక్ మార్పులను చేసి కొత్త 2012 క్యామ్రే కారును రూపొందించారు. ఇది 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో 178 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 230 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో మరో వేరియంట్ 3.5 లీటర్ వీ6 ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 268 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 325 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వేరియంట్లే కాకుండా.. క్యామ్రేలో సరికొత్త హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా టొయోటా ఆఫర్ చేస్తోంది.

విశాలమైన ఇంటీరియర్స్, సరికొత్త డ్యాష్‌బోర్డ్, 10 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్, టొయోటా స్టార్ సేఫ్టీ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రాని బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, స్మార్ట్ స్టాప్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు కొత్త 2012 టొయోటా క్యామ్రే సొంతం. ఇంకా ఇందులో టైర్లలో గాలి యొక్క పీడనాన్ని యాంత్రికంగా పరిశీలించే వ్యవస్థ ఒక స్టాండర్డ్‌గా వస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 25, 2011, 10:51 [IST]
English summary
Japanese auto major Toyota Motor Co unveiled its all-new 7th generation 2012 Camry sedan in US. This is a still best-selling car in America from Toyota.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+