లిమిటెడ్ ఎడిషన్‌ 'ఇన్నోవా క్రిస్టా'ను విడుదల చేసిన టొయోటా

Toyota Innova Crysta
భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మల్టీ పర్పస్ వాహనం (ఎమ్‌పివి) అయిన టొయోటా ఇన్నోవా ఇప్పుడు మరో కొత్త వేరియంట్‌లో లభ్యం కానుంది. జపాన్ ఆటోదిగ్గజం టొయోటా అందిస్తున్న జర్క్-ఫ్రీ ఎమ్‌పివి ఇన్నోవాలో సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ "ఇన్నోవా క్రిస్టా"ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. 2.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో భారత్ స్టేజ్ 3 (BS-III), మరియు స్టేజ్ 4 (BS-IV) ఆప్షన్లలో ఇది లభిస్తుంది.

"భారత్‌లో ఇన్నోవా మా ఫ్లాగ్‌షిప్ బ్రాండ్, ఇది మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంటి ఇప్పటి వరకూ మార్కెట్ లీడర్‌గా ఉంది. కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా క్రిస్టాలో మరిన్ని అధిక లగ్జరీ ఫీచర్లను జోడించడం ద్వారా ఇన్నోవా వాహన యజమానులకు ఎక్స్‌క్లూజివ్ యాజమాన్యపు అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టామ"ని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ తెలిపారు.

ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా క్రిస్టాను కేవలం 1,000 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది. అది కూడా అక్టోబర్ 2011 వరకూ మాత్రమే. దేశీయ మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా ధరను రూ. 13.13 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవాను సొంతం చేసుకొని ఎక్స్‌క్లూజివ్ ఓనర్‌షిప్ అనుభూతిని ఆస్వాదించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 10, 2011, 16:50 [IST]
English summary
The Toyota Innova is one of the most successful MPVs in India and Toyota is adding to its glitz by launching a new limited edition model called the Innova Crysta. The Crysta will be a limited edition model and will be equipped with several luxury features. The Innova Crysta will come with a starting price of Rs.13.3 lakhs (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+